Flash News తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు//తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం: విజయశాంతి //తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా  *  
Special News Top Stories Latest News
 

హైదరాబాద్‌లో బతుకమ్మ 100 రోజుల వేడుక

 

కాకతీయ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బతుకమ్మ చిత్రం 100 రోజుల వేడుక జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినిమా జరుపుకుంటున్న నిజమైన పండుగ ఇది అని అన్నారు. సినీ రంగంలో అతిరథులు లేకుండా నిజమైన నటులతో 100 రోజులు జరుపుకున్న చిత్రమిదని అన్నారు. నైజాంలో 9 ప్రింట్లతో విడుదలై 25 ప్రింట్లకు చేరుకుందని అన్నారు.

చిత్రంలోని ఒక్కో పాత్రధారి చక్కగా నటించారని కొనియాడారు. చిత్ర దర్శకుడు ప్రభాకర్ చెప్పాల్సిన పాయింట్‌ను సూటిగా మనసులకు హత్తుకునే విధంగా చెప్పారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, గోరెటి వెంకన్న, అందెశ్రీ, చిత్ర నిర్మాతలు సరస్వతీ రామ్మోహన్‌రావు, వనజా చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

(మూలం - వెబ్‌దునియా)
« Home « Back
Live Tv

జర్నలిస్టులు-తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారు.........

ADS HERE