|
|
రైలు గుర్తు మార్చుతామంటున్న చిరంజీవి
|
 |
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి 70 లక్షల మంది ఓటేశారని, పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే పదిహేడు శాతం ఓట్లు పొందడం హర్షించదగ్గ విషయమని చిరంజీవి చెప్పారు.
పార్టీ గుర్తు రైలింజన్‌ను మార్చాలని ఈసీని కోరతామన్నారు. రోడ్‌షోలకు వచ్చిన లక్షలాది మంది జనాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో పార్టీ యంత్రాంగం విఫలమైందన్నారు. సామాజిక న్యాయం ఆచరించే క్రమంలో గెలుపు గుర్రాల గురించి పట్టించుకోక పోవడం ఓటమికి మరో కారణంగా చిరు చెప్పారు. నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చేలా త్వరలో కార్యక్రమాలు చేపడుతామన్నారు. మూడు రోజులు పాటు జరిగిన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఏటమికి కారణాలను కూలంకుషంగా చర్చించామని, దీనికిఏ ఒక్కరినో బాధ్యులను చేయకుండా సమిష్టిగా ఓటమిని స్వీకరించామని చిరు తెలిపారు. |
|
|
|