Flash News తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు//తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం: విజయశాంతి //తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా  *  
Special News Top Stories Latest News
 

గోల చేయడం బాబుకు అలవాటే

 

తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సభా సమయాన్ని వృధా చేసేందుకు సభలో తన పార్టీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న బాబు.. ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సరైన చర్య కాదని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గాలి పోగు చేసి దాన్ని వార్తలుగా రాయించి గోల చేయడం బాబుకు అలవాటేనన్నారు.

కాంగ్రెస్‌లో ఉన్నపుడు చంద్రబాబుపై అనేక మార్లు ముద్దుకృష్ణమ నాయుడు వ్యక్తిగత విమర్శలు చేశారని, కాంగ్రెస్‌ పార్టీలో విశ్వసనీయత నిరూపించుకోవడం కోసం నాడు ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఇపుడు తెదేపాలో విశ్వసనీయత కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇందుకోసం ఆయన అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని కన్నా గాలిపై కూడా దుమ్మెత్తి పోశారు.
« Home « Back
Live Tv

జర్నలిస్టులు-తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారు.........

ADS HERE