Flash News తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు//తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం: విజయశాంతి //తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా  *  
Special News Top Stories Latest News
 

సభాపతి ఏకపక్షంగా వ్యవహిస్తున్నారు-చంద్రబాబు

 

సభా వ్యహారాలను పరిరక్షించి, అన్ని పార్టీల సభ్యులను సమానంగా చూడాల్సిన సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారిపట్ల ఆయన వకల్తా పుచ్చుకున్నట్టుగా ఉన్నారని బాబు మండిపడ్డారు.

ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సభాపతి వైఖరితో పాటు.. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై విరుచుకపడ్డారు. తమ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై రోశయ్య మాట్లాడిన తీరుపై పూర్తిగా స్పీకరుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు.

ముఖ్యంగా, రోశయ్య వాడిన భాషను స్పష్టంగా ఆ లేఖలో పేర్కొని చర్య తీసుకోమని కోరితే ఇవాళ స్పీకరు దానిపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడంపై ఆయన పక్షపాత ధోరణికి నిదర్శనమని బాబు విమర్శించారు. స్పీకర్ తానే సుప్రీం అనడం ఇంతకుమించిన దారుణం మరొకటి లేదన్నారు.

ఇకపోతే, కాంగ్రెస్ పార్టీ నేతలు నియంతలా వ్యవహిస్తున్నారన్నారు. అందువల్ల తమపై కావాలనే తప్పుడు కేసుల బనాయిస్తున్నారని ఆరోపించారు. సభలో ముఖ్యమంత్రి, స్పీకర్‌, సీనియర్ మంత్రులు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే కొత్త తరహా ఆంక్షలను విధిస్తున్నారని బాబు ఆరోపించారు.
« Home « Back
Live Tv

జర్నలిస్టులు-తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారు.........

ADS HERE